file

పురాణాల్లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన రాముడు భక్తుడు అని అందరికి తెలుసు. ఈయనకు రామాయణం లో రాముడి అంత ప్రాముఖ్యత ఉంది. చాలా మంది హనుమంతుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.. ముఖ్యంగా ఈయనను మంగళవారం రోజు పూజిస్తూ ఉంటారు.. మంగళ వారం అనగానే ఆంజనేయ స్వామినే గుర్తుకు వస్తాడు..

హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం.. అందుకే ఈయనకు తమలపాకులు లేకుండా పూజలు చేయరు. అయితే హనుమంతుడిని అందరి దేవుళ్ళలాగా ఎలాగా పడితే అలా పూజించరు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. ఇక ఈయనకు దేశ వ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి.. అక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి..

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022, ఈ ఏడాది మానవత్వం కోసం యోగా స్లోగన్‌ను నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

మరి హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు.. సకల కార్యజయం కావాలంటే హనుమాన్ ను అర్చించాలి.. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ దోషాలు పోవడానికి ఆంజనేయుడిని ఆరాధిస్తే చాలు. ఈయన సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణా, అర్చన ద్వారా పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి..

చిన్నపిల్లకు ఆంజనేయుడు బిళ్ళ మెడలో కడితే సకల దోషాల నుండి వారు విముక్తి పొందుతారని మన పూర్వీకుల నుండి విశ్వాసం.. మీరు ఆంజనేయ స్వామిని కొలిస్తే గ్రహ పీడ నుండి విముక్తి పొందుతారట.. అలాగే పిల్లలు లేని దంపతులు పిల్లలు పుట్టడానికి ఉన్న నవగ్రహ దోషాలు, కార్యాల్లో ఆటంకం రాకుండా సుందరకాండ పారాయణం చేస్తే సకల దోషాలు తొలగిపోయి సర్వకార్య జయం కలుగుతుంది.