(Photo-file Image)

రేపు భాద్రపద ఏకాదశి, సోమవారం, సెప్టెంబర్ 24న శివుడికి చేసే అర్చన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు ప్రదోషకాల సమయంలో శివనామస్మరణ, శివాభిషేకం, భస్మధారణ, శివాలయ సందర్శనం, ప్రదక్షిణం, శివ స్తోత్ర పారాయణలు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. భాద్రపద ఏకాదశి, సోమవారం శివలింగాన్ని పూజిస్తే అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. శివలింగానికి పూజ చేయాలనుకునేవారు రాతితో చెక్కిన లింగాన్ని తెచ్చుకోవాలని అంటున్నారు. లింగాభిషేకం ద్వారా ఐశ్యర్యంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే శివ లింగానికి ఎలాంటి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం..

శివ లింగాన్ని పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా జీవిస్తారని తెలుపుతున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి

శివ లింగాన్ని రకరకాలుగా పూజలు చేయవచ్చు.స్పటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యు భయం పోతుంది. ఆవుపాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో చేస్తే బలం, కీర్తి ప్రఖ్యాతలు కలుగుతాయి. చెరుకు రసంతో పూజిస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దు:ఖం ఉండదు. మారేడు పత్రాలతో పూజిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. తేనెతో అభిషేకిస్తే ఆయుష్సు పెరుగుతుంది. పూలతో ఉన్న నీటితో చేస్తే భూ లాభం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి.

శివలింగం అభిషేకం చేసిన తర్వాత ఈ నీటిని మీ ఇంట్లో చల్లుకున్నట్లయితే సకల కష్టాలు పోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే అభిషేకం చేసిన నీటిని తలపై చల్లుకుంటే ఆయుష్షు పెరుగుతుందని శివపురాణం చెబుతోంది.