Independence Day 2023 Wishes, Quotes, Messages, Status, Images : బ్రిటీష్ వారు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించారు, వారి బానిసత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడంలో చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ముఖ్యమైన పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15 భారతదేశం బ్రిటిష్ వారి బానిసత్వం నుండి పూర్తిగా విముక్తి పొందిన రోజు.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న, దేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఈసారి 76వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. స్వాతంత్ర దినోత్సవం భారతదేశ ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలు లభించిన రోజు. ఇది 15 ఆగస్టు 1947న బ్రిటిష్ వారి నుండి దేశం స్వతంత్రం పొందిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు, ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి.
సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..
భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు