
రేపు అంటే జూన్ 4న జేష్ఠ పౌర్ణమి ఈరోజు నుంచి ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభ ఘడియలు ప్రారంభం కానున్నాయి ఇవి జూన్ 18 వరకు కొనసాగుతాయి ఈ 15 రోజుల్లో ఈ నాలుగు రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం
కన్యారాశి : జూన్ 4 నుంచి కన్యా రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ 15 రోజులపాటు వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు పాలిస్తాయి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కన్యా రాశి వారు కొన్ని విషయాల్లో ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బులు వృధాగా ఖర్చు చేయరాదు. దూరప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించవద్దు. మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది.
కుంభరాశి : ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ఆదాయం లభిస్తుంది ఉదాహరణకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి చక్కటి లాభాలు లభిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కొత్త ఆస్తులు కొనేందుకు ఇది మంచి సమయం అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. అయితే కుంభ రాశి వారు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా బెట్టింగు అలాగే అడిగిన వారికి అప్పులు ఇవ్వకూడదు. ఈ పదిహేను రోజులు శివాలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది
మీనరాశి: ఈ రాశి వారు జూన్ 4 నుంచి జూన్ 18 వరకు అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఇంక మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం .
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
వృషభ రాశి: ఈ రాశి వారు జూన్ 4 నుంచి జూన్ 18 వరకు అమృత ఘడియల్లో ఉంటారు. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి డబ్బులు కలిసి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. అయితే వృషభ రాశి వారు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు సన్నిహితులు మోసం చేసే ప్రమాదం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉడికించిన శనగలను నైవేద్యంగా పెడితే మంచిది