Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

కొన్ని వస్తువులను తల దగ్గర ఉంచుకోవడం వల్ల అనుకూల ప్రభావం ఉంటుంది. కాబట్టి నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఏమి పెట్టుకోవాలి ? వాస్తు ప్రకారం, మీ తల దగ్గర ఈ క్రింద తెలిపిన వస్తువులు పెట్టుకోవడం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే సంపద, శ్రేయస్సును తెస్తుంది.

తల దగ్గర ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో తెలుసుకుందాం.

సువాసనగల పువ్వులు : నిద్రపోయే ముందు మీ దిండు దగ్గర సువాసనగల పువ్వులను ఉంచండి. ఇది మంచి వైవాహిక జీవితంతో పాటు మానసిక ప్రశాంతతను మరియు మంచి నిద్రను తెస్తుంది.

నాణేలు: పడుకునేటప్పుడు ఒక చిన్న గిన్నె ఉప్పు మరియు ఒక రూపాయి నాణెం తూర్పు ముఖంగా మీ తల దగ్గర పెట్టుకోండి. మంచి ఆరోగ్యం ఉంటుంది.

వెల్లుల్లి: నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచండి. ఇది సానుకూల శక్తిని మరియు మంచి నిద్రను ప్రసారం చేస్తుంది.

Sunday Pooja: నేడే కామిక ఏకాదశి, ఈ పనులు పనుకు చేసేందుకు దూరంగా  ఉండండి, లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై దరిద్రానికి దగ్గర అవుతారు.. 

పాలు: మీ తల దగ్గర ఒక గ్లాసు పాలు తీసుకుని ఆదివారం నిద్రపోండి. ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేసి ఆలం చెట్టు వేరుకు పాలు ఇవ్వాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

మెంతులు: మెంతికూరను దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల రాహుదోషం తగ్గి చెడు కలలు దూరమవుతాయి. మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పచ్చి ఏలకులు: దిండు కింద పచ్చి ఏలకులు పెట్టుకుని పడుకోవడం వల్ల గాఢ నిద్ర వస్తుంది.

వాటర్ బాటిల్: నిద్రపోయేటప్పుడు నీళ్లతో నిండిన రాగి పాత్రను తల దగ్గర పెట్టుకోవాలి. ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కత్తి : నిద్రపోయేటప్పుడు కత్తి, కత్తెర లేదా ఏదైనా లోహపు వస్తువును దిండు కింద ఉంచండి. ఇలా చేస్తే భయంకరమైన కలలు మళ్లీ రావు.

నోట్: ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి లేటెస్ట్‌లీ ధృవీకరించడంలేదు. ఇది వాస్తవమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ప్రజల విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది