ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగను మార్చి 8న జరుపుకుంటారు. శివుని పూజించే అతి పెద్ద పండుగ ఇది. మహాశివరాత్రిని శివోద్భవం జరిగిన రోజు అంటారు. ఈ శుభ సందర్బంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా మీ ప్రియమైనవారికి అభినందన సందేశాలను పంపాలనుకుంటే, ఈ కథనంలో మేము మీ కోసం ఎంచుకున్న కొన్ని శుభాకాంక్షల సందేశాలను తీసుకువచ్చాము, వీటిని మీరు మహాశివరాత్రి సందర్భంగా మీ ప్రియమైనవారికి పంపవచ్చు.
శివుడు సత్యం, శివుడు అనంతం,
శివుడు శాశ్వతం, శివుడు భగవంతుడు,
శివుడు ఓంకారం, శివుడు బ్రహ్మ,
శివుడు శక్తి, శివుడే భక్తి.
మహాశివరాత్రి శుభాకాంక్షలు.
లయకారుడు, భోళా శంకరుడు ,లింగోద్భవం జరిగిన మహా శివరాత్రి పర్వదినాన, ఆ మహాశివుడి ఆశీస్సులు మన అందరికి ఉండాలని కోరుకుంటూ... మిత్రులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.
హర హర మహాదేవ శంభో శంకర… ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు..
ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో మీరంతా సుఖశాంతులతో జీవించాలని, ఆ మహా శివుని కరుణ కటాక్షాలు ఎల్లప్పుడు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మన్త్రో న తీర్థం న వేదా న యజ్ఞాః | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానన్దరూపః శివోహం అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం. అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!