
Maha Shivratri: మహాశివరాత్రి అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పండుగ హిందూ పండుగలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పార్వతీ దేవిని వివాహమాడిన రోజున మహాశివరాత్రి అని అంటారు. ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మాఘ మాసంలోని శుక్లపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పరమశివుని భక్తితో కొలిస్తే అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.శివరాత్రి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఆ శివుడికి అభిషేకం చేసి ఉపవాసానికి ముందు ఈ శ్లోకాలు పట్టిస్తే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది.
1. శివ పంచాక్షరి మంత్రం
ఓం నమః శివాయ
2. మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనమ్ |
ఉర్వారుకమివ బంధనాన్, మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
3. లింగాష్టకం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం |
నిర్మల భాసిత శోభిత లింగం ||
జన్మజ దుఃఖ వినాశక లింగం |
తత్‌ప్రణమామి సదాశివ లింగం ||
4. శివ తాండవ స్తోత్రం
జటాటవీ గలజ్జల ప్రభాహి తస్తలేఽ
గలెఽవలంబ్య లంబితాం భుజంగ తుంగమాలికామ్ ||
డమద్దమద్దమద్దమన్నినాదవద్దమర్వయం |
చకార చండతాండవం తనోతు నా శివః శివమ్ ||
5. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్ర సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం |
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం ||
పర్వతే ముక్తినాథం చ దాక్షిణాం భీమశంకరమ్ |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే ||
వారణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే |
హిమాలయే తు కేదారం ఘృష్ణేశం చ శివాలయే ||
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
6. శివాయ నమః మంత్రం
ఓం తత్‌పురుషాయ విధ్మహే, మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.