Monday Pooja: సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ పనులు అస్సలు చేయవద్దు, పరమ శివుడి ఆగ్రహానికి గురవుతారు,
Lord Shiva (Photo Credits: Pixabay)

సోమవారం అన్ని రోజుల లాంటిది కాదు. ఈ రోజు పరమేశ్వరుడి రోజు.  ఇవాళ ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం. సోమవారం నాడు మీ ఇంట్లోకి పాము వచ్చి... మిమ్మల్నే కాటు వేసే పరిస్థితి ఉన్నా... మీరు మాత్రం దాన్ని చంపకూడదు. సోమవారం నాడు పామును చంపితే... భారీ ఎత్తున నెగెటివ్ ఎనర్జీ మీలో, మీ ఇంట్లో చేరుతుంది. ఇక అన్నీ చెడులే జరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

సోమవారం కొంత మంది నాన్ వెజ్ తింటారు. అలా అస్సలు చేయకూడదట. కొంత మంది ఆదివారం మాంసం మిగిలితే... దాన్ని ఫ్రిజ్‌లో జాగ్రత్త చేసి సోమవారం తినాలనుకుంటారు. అలా అస్సలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో శాఖాహారం మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

కొంత మందికి సోమవారం వీకాఫ్ ఉంటుంది. దాంతో ఆ రోజు షేవింగ్ చేసుకుంటారు. కానీ పండితులు మాత్రం సోమవారం అస్సలు షేవింగ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. మీరు సోమవారం శివుడిని పూజిస్తూ... ఉపవాస దీక్ష చేయాలనుకుంటే చేయండి. ఐతే... పూజ ముగిసే వరకూ ఉపవాస దీక్ష మానకూడదు. పూజ తర్వాతే దీక్షను విరమించాలని పండితులు సూచిస్తున్నారు.