రాశి ఫలాల ఆధారంగా ఈ నాలుగు రాశుల వారికి జూలై 1 నుంచి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందటా. వీరికి డబ్బుకు కొదవే ఉండదని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నాలుగు రాశుల వారు ఎవరు.? ఆర్థికంగా వారి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఓ లుక్కేయండి..
వృషభం..
వృషభ రాశికి శుక్ర గ్రహం ప్రభువు అనే విషయం మనందిరకీ తెలిసిందే. శుక్రుడు మానవులకు విలాసాలను అందించే గ్రహంగా భావిస్తారు. కాబట్టి ఈ రాశి వారికి శుక్ర గ్రహ అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ రాశుల వారు డబ్బు విషయంలో ఎలాంటి కొరత లేకుండా ఉంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి సంపదతో పాటు అవసరమైన వాటన్నింటినీ సమకూర్చుకుంటారు.
సింహ రాశి..
సింహ రాశి వారికి సూర్యదేవుడు అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు.. ఉద్యోగం, వ్యాపారం, గౌరవాలను అందిస్తాడని భావిస్తారు. సింహ రాశి వారిలో న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారికి అపారమైన సంపద లభిస్తుంది.
ధనుస్సు..
ధనుస్సు రాశికి బృహస్పతి అధిపతి. ఈ గ్రహం కారణంగా ధనుస్సు రాశి వారికి అపారమైన శక్తి, జ్ఞానం కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలోకి వెళ్లినా వారి జ్ఞానంతో ఉన్న శిఖరాలను చేరుకుంటారు. సమాజంలో వీరికి తగినంత గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారు చాలా కష్టపడి, నిజాయితీతో పని చేస్తారు. డబ్బు సంపదలోనూ వీరు ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వారి ఆశావాద దృక్పథం, ధైర్యం, మాట్లాడే విధానం ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి శని దేవుడు అధినేత. ధనవంతులు కావడంలో ఈ రాశివారిని ఎవరూ ఆపలేరు. వీరిపై శని దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ తప్పు చేయరు.. అలాగే ఇతరులు తప్పు చేసినా ఉపేక్షించరు. వీరు సాంఘిక, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కారణంగా వీరికి సమాజంలో గౌరవం లభిస్తుంది. శని దేవువుడి కారణంగా వీరు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరు న్యాయంగా జీవిస్తూ దూరదృష్టితో ఆలోచిస్తారు.