(Image: Twitter)

సెప్టెంబర్ 21 నుంచి మూడు రాశుల వారికి గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 1:55 గంటలకు బుధగ్రహం తన రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఆ రాశుల వారికి అనర్ధాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య సంసప్తక యోగం జరుగుతుందని వివరిస్తున్నారు. ఇంతకూ ఆ రాశులు ఏంటి..? వారికి జరగబోయే నష్టం ఏంటో తెలుసుకుందాం..

మేష రాశి : బుధుడి ప్రభావం మేష రాశిపై పడుతుంది. దీని వల్ల ఆ రాశి వారికి నేరుగా నష్టం జరగకపోయినా వారి పిల్లలపై దీని ఎఫెక్ట్​ అధికంగా ఉంటుంది. పిల్లల చదువు మందగించడంతోపాటు చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉందట. ఈ సమయంలో మేష రాశి వారు ఆందోళన చెందకుండా పిల్లలపై చదువులపై శ్రద్ధ పెట్టాలి. వారిని ప్రోత్సహిస్తూ ఎడ్యుకేషన్​పై దృష్టి సారించేలా చూడాలి. 11 రోజుల పాటు హనుమాన్ చాలీసా చదవితే ఏ ప్రమాదం ఉండదు.

వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ

తుల రాశి : బుధుడి చలనం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన చోట్ల అధికంగా ధనం వృథా అవుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. ఆఫీసులో జాగ్రత్త వహించండి. కోర్టు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. గణపతిని పూజించండి, మీ రాశిపై ఉన్న దృష్టి పోతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారి ఆరోగ్యంపై బుధుడి ప్రభావం చూపుతుందట. తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత కావునా 11 మంగళవారాలు ఆంజనేయుడి గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టండి.