
ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే చాతుర్మాసం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. సృష్టికి పోషకుడైన విష్ణువు ఈ కాలంలో పాల సముద్రంలో విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. ఈ కాలం చాలా పవిత్రమైనది అయినప్పటికీ, ఈ కాలంలో శుభ ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఈ నాలుగు మాసాల్లో భగవంతునిపై మరింత భక్తిని పెంచుకోవాలని అంటున్నారు. పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీ కుటుంబ సభ్యులు, బంధువులకు తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి.

నేడు ఆషాఢ ఏకాదశి. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. ఆషాఢ ఏకాదశి నాడు రాశి ప్రకారం దానం చేయాలి.

భగవంతుడికి తులసిని సమర్పించండి
తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున తులసిని దేవుడికి సమర్పించడం మర్చిపోవద్దు. అది లేకుండా, ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

ఎలాంటి ఆహారం తినాలి?
ఈ రోజు ఉపవాసం ఉండని వారు తామసిక ఆహారం తినకూడదు. మసాలా, మాంసం, చేపలు, గుడ్డు, ఉల్లిపాయలు, వెల్లుల్లి తినవద్దు. ఇది ప్రతికూలతకు దారితీస్తుంది.

దానం చేయండి
ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకున్నా ధనం, వస్త్రాలు, అన్నం, నీరు దానం చేయాలి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

బ్రహ్మచర్య కర్మ
ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ మనస్సును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. రోజంతా మంత్రోచ్ఛారణలతో గడపాలి.

తొలి ఏకాదశి శుభాంక్షలు మీ బంధు, మిత్రులకు తెలియజేయండి..

తొలి ఏకాదశి శుభాంక్షలు మీ బంధు, మిత్రులకు తెలియజేయండి..