(Photo Credit: social media)

Vastu for Pooja Room in House: దైవభక్తి అధికంగా ఉన్నవారు దేవుడికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకుంటారు. అటువంటి వారు వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు అన్నది చూద్దాం… పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా పశ్చిమ దిక్కున ఏర్పా టు చేయాలి. దీనికి కారణం తెల్లవారు జామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది.

ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్లో స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున దేవుడి పటాలను తగిలించి పూజ చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి. పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. పూజగది బాత్‌రూంకు సమీపంలో లేకుండా చూసుకోవాలి.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల  

విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కున, తల ఉత్తరం దిక్కున ఉంటాయి. అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి.

దేవుడి ముందు దీపాలు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముం దే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనుపిస్తాయి. పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ గదిలో డబ్బు ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. కారణం దాని వల్ల గది మరింత కుదురుగా కనుపిస్తుంది. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు.