ధనాన్ని నిల్వచేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు. ధనాన్ని నిల్వచేసే బీరువాను ఇంట్లో పెట్టే విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలు ఉంటాయి. ఆ నియమాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ధనాన్ని, నగలను దాచిపెట్టే వస్తువు అయిన బీరువా ఒకటి. అటువంటి బీరువాలను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బీరువాని పెట్టడంలో వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి. ఉత్తర వాయువ్యంలో బీరువా ను పెట్టి డబ్బులు నగలను ఆ బీరువాలో పెడుతుంటే, ధనం పెరగడమే కాకుండా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరం గోడ పడమటి గోడ రెండూ కలిసిన మూల అయిన వై వీధిలో బీరువా పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరానికి బీరువా వెనుకభాగం చూసేవిధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, పోతుంది అని చెబుతున్నారు.
నైరుతి మూలలో బీరువాలో పెట్టి డబ్బులు , నగలు పెడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అలా పెడితే బీరువాలో డబ్బులు, నగలు అసలు పెరగవని, జీవితంలో ఆర్థిక వృద్ధి ఉండదని వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం. ఇక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీరువాని సరైన స్థానంలో పెట్టడంతో పాటు, మరి కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం నిర్దేశించిన దిక్కులలో ఉన్న ధనాన్ని పెడితే ధన వృద్ధి చెందుతుందని, ఇంట్లో సంతోషం నిండుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఆర్థిక కష్టాలు కలగకుండా వాస్తు శాస్త్రం నిర్దేశించిన సూచనల మేరకు ధనాన్ని పెట్టి లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.