వాస్తు ప్రకారం కొనని నియమాలు సరిగ్గా పాటించకపోతే, ఇంట్లో దోషాలు మిమ్మల్ని వేధిస్తాయి. దోష ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మాత్రమే కాకుండా, శారీరక లేదా ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. వాస్తు దోషాలు ఒక్కసారి ప్రభావం చూపడం ప్రారంభిస్తే, దాని దుష్ఫలితాలు చాలా కాలం పాటు ఉంటాయని చెబుతారు. ఇంటి మెయిన్ డోర్‌కి అమర్చే డోర్ బెల్ సంబంధించి వాస్తు విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాలి.
ఇంటి ప్రధాన ద్వారంపై డోర్ బెల్ ఉంచితే ఇంట్లో ప్రతికూలత ప్రబలుతుందని పేదరికం రావడం ప్రారంభమవుతుందని నమ్ముతారు. డోర్‌బెల్‌కు సంబంధించిన వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును పొందవచ్చని మేము మీకు చెప్పబోతున్నాము.
డోర్‌బెల్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎందుకు అవసరం
వాస్తు శాస్త్రం ప్రకారం డోర్ బెల్ చాలా ముఖ్యనది. ఎందుకంటే అది లేకపోతే, ప్రతికూల శక్తి ఇంట్లోకి రావచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చి డోర్ బెల్ లేని పరిస్థితిలో తలుపు తడతారు. అలా తట్టడంతో, ప్రతికూల శక్తి ఇంట్లో కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. ఇది ఇంట్లో నివసించే వారి మనస్సుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
నేమ్ ప్లేట్ పైన డోర్ బెల్ ఉంచండి
చాలా ఇళ్లలో మెయిన్ డోర్‌కు పెట్టాల్సిన నేమ్ ప్లేట్, డోర్ బెల్ అమర్చడంలో పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాటు ఇంటి పెద్దని కలవరపెడుతుంది. వాస్తు ప్రకారం, మెయిన్ డోర్‌పై అమర్చే డోర్‌బెల్ ఎల్లప్పుడూ నేమ్ ప్లేట్ పైన ఉంచాలి. ఇది కుటుంబ పెద్ద యొక్క కీర్తి మరియు సంపదను పెంచుతుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఈ చిత్రపటాలను గోడకు తగిలిస్తే, జరిగే నష్టాన్ని తట్టుకోలేరు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..
గంట శబ్దం
బిగ్గరగా ధ్వనించే డోర్‌బెల్ మంచిది కాదు. బదులుగా, మీరు ఇంటి కోసం అలాంటి డోర్‌బెల్‌ను ఉపయోగించాలి, దీని స్వరం శ్రావ్యంగా ఉంటుంది. గాయత్రి మంత్రం, లేదా, దేవతల స్తోత్రాలను డోర్ బెల్ శబ్దం కింద వాడవచ్చు.