Lunar Eclipse: 2022 సంవత్సరానికిగాను రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. గ్రహణాల రోజు ఏ పని, పూజలు కూడా చేయకూడదు. ముఖ్యంగా చంద్రగ్రహణం యొక్క ప్రభావం 12 రాశుల పై ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మనదేశంలో కనిపించదు. సూతకకాలం కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఇక మొదటి చంద్రగ్రహణం మే 16వ తేదీన అనగా ఉదయం 8:59 గంటల నుంచి 10:30 గంటల వరకు ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఇంట్లో ఉండడమే మంచిది. అంతేకాదు చంద్ర గ్రహణం సమయంలో కూడా ఏమి తినకూడదు. ముఖ్యంగా మే 16వ తేదీన కొన్ని గ్రహాలలో అద్భుతమైన మార్పులు జరగనున్నాయి. ఈ రాశుల జాతకాల వారికి అదృష్టం రానుంది.. శుభ ఫలితాలు కూడా కనిపించనున్నాయి. మరి ఆ 3 రాశుల లో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చూసి తెలుసుకుందాం..
మేష రాశి :
చంద్రగ్రహణం యొక్క ప్రభావం మేష రాశి పై అధికంగా ఉండడం వలన శుభఫలితాలు కలుగును. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. చేపట్టిన పని3 పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. ఏ పని ప్రారంభించినా సరే విజయవంతం అవుతుంది. ఇక గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రశంసలతో పాటు జీతం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో తులతూగుతారు.
వృషభ రాశి :
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం , రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా యాత్రలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా అదృష్టం పట్టబోతోంది.
కన్య రాశి :
కన్య రాశి జాతకులకు చంద్రగ్రహణం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ కూడా నమ్మకూడదు. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారం మీద పెట్టుబడులు పెట్టే వారికి ఇది శుభ సమయం. వారికి సంపద పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. ఇక అన్ని విధాలా శుభవార్తలు వింటారు.చంద్ర గ్రహణం ప్రభావం వల్ల 2035 వ సంవత్సరం వరకు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.