సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి.
యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.
అరటి పండు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.
గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది
అశ్వగంధ: సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.
స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.
ఆస్పరాగస్: దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.
గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.
రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.