Photo: Wikimedia Commons.

క్యాన్సర్ అనే పదం వినగానే మరణం గుర్తుకు వస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే మనిషి జీవితం సగం అయిపోతుంది. చాలా అరుదుగా మాత్రమే వ్యాధి నుండి కోలుకుంటారు. ఈ క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది.  ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. నేటి  జీవనశైలిలో, ప్రజలు నాణ్యమైన ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. చాలా మంది ఫ్రైడ్ ఫుడ్ , జంక్ ఫుడ్ కు అలవాటు పడి మద్యం సేవించే వారి సంఖ్య, పొగతాగే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. పెద్దప్రేగు క్యాన్సర్ చాలా ముఖ్యమైన క్యాన్సర్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్యాన్సర్ మరణాలకు పెద్దపేగు క్యాన్సర్ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.

2020లో, ప్రపంచవ్యాప్తంగా 1.9 మిలియన్లకు పైగా కేసులు మరియు 9,30,000 కంటే ఎక్కువ మరణాలు కొలొరెక్టల్ క్యాన్సర్ లేదా పెద్దప్రేగు క్యాన్సర్ కారణంగా సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొలొరెక్టల్ క్యాన్సర్ యొక్క నిర్దిష్ట కారణం తెలియనప్పటికీ, ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు జాబితా చేయబడ్డాయి.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది పురీషనాళంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగే వ్యాధి. పురీషనాళం అనేది పెద్దప్రేగును పాయువుతో కలిపే మార్గం. కొన్నిసార్లు పురీషనాళంలో పాలిప్స్ అనే కణాలు అభివృద్ధి చెందుతాయి. కొంత కాలం తర్వాత ఈ కణాలలో కొన్ని క్యాన్సర్ కణాలుగా మారతాయి. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌గా మారే పాలిప్స్‌ను తొలగించవచ్చు. స్క్రీనింగ్ పరీక్షలు కొలొరెక్టల్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడతాయి.

ఆల్కహాల్, వైట్ బ్రెడ్ నుండి పెద్దప్రేగు క్యాన్సర్:

పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడానికి, కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టండి. ఇది వ్యాధి అభివృద్ధి ప్రమాదాన్ని నిరోధించవచ్చు. జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పెద్దప్రేగు క్యాన్సర్‌లో జన్యుశాస్త్రం, ఆహారం రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అమెరికన్ బయోబ్యాంక్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 139 రకాల ఆహారాలు మరియు పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అవి మన వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతాయో పరిశీలించింది. ఈ అధ్యయనంలో దాదాపు 1,18,210 మంది పాల్గొన్నారు. 12.8 సంవత్సరాలలో మొత్తం 1466 పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు గుర్తించబడ్డాయి, అధ్యయనం తెలిపింది.

అధ్యయనాలు కొన్ని ఆహారాలు, అవి కలిగించే వ్యాధుల ప్రమాదాన్ని చూపించాయి. ఆల్కహాల్ మరియు వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఒక వ్యక్తి ఆహార ఎంపికలు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని లేదా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.