అందంగా ఉండాలనుకుంటున్నారా మీ మొహం పైన మచ్చలు మొటిమలు లేకుండా మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చలికాలంలో మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మన చర్మం అనేది పగుల్తూనే ఉంటుంది నలుపు కూడా అవుతుంది. చలికాలంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి. అంటే మన వంటింట్లోనే చాలా ఔషధ గుణాలున్న మూలికలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పసుపు అనేది నేచురల్ బ్యూటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. పాతకాలం నుండి కూడా పసుపుని అందం కోసం వాడుతూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ కూడా మొటిమలను మచ్చలను తగ్గించడంలో మొదటి స్థానంలోనే ఉంది. పచ్చి పసుపులో ఇంకా ఎక్కువ మోతాదులో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి. పచ్చి పసుపు గనుక మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా దానిని మెత్తగా పొడి చేసుకొని దానిలో కొంచెం శెనగపిండి కొంచెం గంధం పొడి కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పెట్టుకొని అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత మొహాన్ని గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేసినట్లయితే కచ్చితంగా మొటిమల ద్వారా ఏర్పడినటువంటి మచ్చలు చలికాలంలో ఏర్పడినటువంటి పగుళ్లు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దానితోటి మీ అందం రెట్టింపు అవుతుంది ఈ విధంగా ఒక వారం రోజులు చేసి చూడండి అద్దంలో మీ మొహాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.