Best Indoor Plants for Clean Air: మీ గదిలో ఆక్సిజన్ విరివిగా లభించాలని కోరుకుంటున్నారా, అయితే ఈ మొక్కలు మీ గదిలో పెంచుకోండి..
(Photo Credits: Wikimedia Commons)

మొక్కల పెంపకం మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. పచ్చని మొక్కలు చూసి మనసు పులకరిస్తుంది. పెరట్లోనే కాదు.. చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు కూడా మొక్కల పెంపకంపై దృష్టి సారించడానికి కారణాలివే. మొక్కలు పువ్వుల్ని.. కొన్ని మొక్కలు కాయల్ని ఇవ్వడమే కాదు.. మంచి ఆక్సిజన్ అందిస్తాయి. కానీ ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకోవడం వల్ల వేడిని లాగేసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఎక్కువ నీరు తాగవు కూడా. వీటి ధర 50 నుంచి 500 మధ్య ఉంటుంది.

ఏపీలో కొత్తగా 101 మందికి కరోనా, పశ్చిమ గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13 కేసులు

చాలా మంది ఇళ్లలో, ఇంటి వరండాలో, బాల్కనీ, గార్డెన్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చూసేందుకు అందంగా ఉండి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. ప్రతి రోజూ 80 నుంచి 90 మంది వీటిని కొనుక్కెళ్తున్నారని నర్సరీ యజమాని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఎలా ఉందో తెలిసిందే. దీంతో ఆక్సిజన్ అవసరం తెలుస్తోంది. ఇదే విధంగా ఆక్సిజన్ మొక్కల ఉపయోగం కూడా తెలుస్తోంది అంటున్నాడు. అందుకే ఆక్సిజన్ మొక్కల సేల్స్ బాగున్నాయని నర్సరీ ఓనర్స్  అంటున్నాడు. ఆక్సిజన్ మొక్కలపై ఉదయం ఎండ తప్పితే.. మిగిలిన రోజు ఎండ పడకూడదని వారంలో 1 లేదా 2 సార్లు మాత్రమే నీరు పొయ్యాలంటున్నారు.

ఆక్సిజన్ మొక్కలపై కొందరు సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారని అంటున్నాడు. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే ఈ మొక్కలు రాత్రిళ్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయని.. అది ఆరోగ్యానికి మంచిది కాదని.. అది ప్రమాదని పుకార్లేనని.. వాటిని నమ్మొద్దని చెప్తున్నారు. పగలైనా, రాత్రైనా అవి ఆక్సిజనే విడుదల చేస్తాయి. మనీ ప్లాంట్ కూడా 24 గంటలూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని అంటున్నాడు. ఈ ఆక్సిజన్ మొక్కల ధర రూ.50 నుంచి రూ.500 మధ్య ఉంటుంది.