Representative Image (Photo Credits: File Photo)

Custard Apple: శీతాకాలంలో విరివిగా లభించే పండు సీతాఫలం (Custard Apple) . ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మూడు రకాలుగా సీతాఫలాలు లభిస్తున్నాయి. ఇలి సీతాఫలం (Custard Apple) , రామాఫలం, లక్ష్మణా ఫలంగా వీటిని పిలుస్తారు. రుచిపరంగా ఈ పండ్లలో భిన్నత్వం ఉన్నప్పటికీ గుజ్జు, గింజలు మాత్రం ఓకేలా ఉంటాయి. సంస్కృతంలో సీతాఫలం (Custard Apple) , గండగాత్రి, ఇంగ్లీష్‌లో కస్టర్ట్ యాపిల్, ఘగర్ యాపిల్, స్వీట్ యాపిల్‌గా, హిందిలో షరీఫా, సీతాఫల్‌గా వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. ఈ పండ్లు అన్ని వయస్సుల వారికి ఆమోదయోగ్యమైనవే. ఈ పండు ప్రస్తావన పురాణేతిహాసాలల్లో కూడా ఉంది.

సీతాఫలం (Custard Apple) లో పోషక విలువలు పరంగా చూస్తే ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియంలు అధికంగా లభిస్తాయి. పండు తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. 100 గ్రాముల సీతాఫలం (Custard Apple) లో భోజ్యభాగం-45 శాతం, తేమ-68.6 గ్రాములు, కొవ్వు-1.6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు -26.2 గ్రాములు, పీచు పదార్థ్ధాలు-2.4 గ్రాములు, కాల్షియం-398, పాస్ఫరస్-40, ఇనుము-0.3, విటమిన్ సి-16.థయామిన్-33, రైబోఫ్లోవిన్-44, నియాసిన్-1.3 మిల్లీ గ్రాములు ఉన్నాయి. ఒత్తిడితో సతమతమవుతు న్నపప్పడు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు, శస్త్ర చికిత్స జరిగిన తరువాత, గాయాలు మానుతున్న సమయంలో ఇవి తింటే ఎంతోమేలు జరుగుతుంది. రోజుకు ఒక సీతా ఫలాన్ని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు.డాక్టర్ ను కలువాల్సిన అవసరమే ఉండదు.

సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తోంది. తరుచుగా వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలకు మేలు చేస్తోంది. గుండె జబ్బులు, నరాలు, కండరాల బలహీనత గల వారు వీటిని తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సీతాఫలాన్ని మిల్క్‌షేక్స్, ఐస్‌క్రీమ్, జ్యూస్, వుడ్డింగ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.