చికెన్ తినేవారులో కొందరు విత్ స్కిన్, వితౌట్ స్కిన్ తింటారు. చాలామంది వితౌట్ స్కిన్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే…చికెన్ స్కిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని అనుకుంటారు. మీరు ఒక లిమిట్ లో చికెన్ స్కిన్ తింటే , అది ఆరోగ్యానికి ప్రమాదం కాదని, చికెన్ స్కిన్ మంచిదని పరిశోధనలు వెల్లడించాయి.
అయితే ఒక లిమిట్ లో తింటే ఆరోగ్యానికి మంచిదని, మితిమీరి తింటే… మంచిది కాదని అంటున్నారు. ఇందులో ఒక ఔన్స్ స్కిన్ లో 8 గ్రాముల అన్-సాచురేటేడ్ కొవ్వు, 3 గ్రాముల సాచురేటేడ్ కొవ్వు ఉంటుంది. అలాగే ఇది గుండెపోటు, గుండెజబ్బు ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇది హార్మోన్లను కూడా క్రమబద్దీకరిస్తుంది.
స్కిన్ లెస్ చికెన్, స్కిన్ తో కూడిన చికెన్ కి తేడా పెద్దగా ఉండదు. అందులో కొద్దిగా ఎక్కువ అదనపు క్యాలరీలు ఉంటాయి అంతే. అయితే చర్మం ఉన్న మాంసం తక్కువ నూనెను గ్రహిస్తుంది కనుక ఇది మరో ప్రయోజనకారి. స్కిన్ లెస్ చికెన్ ఎక్కువ నూనెను గ్రహిస్తుంది. మీరు స్కిన్ తో పాటు తింటే, స్కిన్ బాగా వేగేదాకా వేయించకండి.