(Photo Credits: Pixabay)

కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వలన అవి శరీరానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాలు అరటి పండు కలిపి తింటే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ముఖ్యంగా పాలలోని లాక్టిక్ ఆసిడ్ అనే రసాయనము అరటి పండులోని పొటాషియం తో కలిస్తే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది.  అందుకే నిపుణులు  అరటిపండు పాలను కలిపి తీసుకోవద్దు అంటున్నారు. 

అలాగే అరటి పండును తిన్న తర్వాత ఒక అరగంట  ఆగిన తర్వాత పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే జీర్ణ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  అలాగే పెరుగుతో సైతం అరటి పండ్లు తినవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.  పెరుగులోని బ్యాక్టీరియా అరటి పండులోని పొటాషియం తో కలిసి ప్రమాదకరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని,  తద్వారా కడుపులో అజీర్ణం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అలాగే అరటి పండుతో కోడిగుడ్లను కూడా కలిపి  తినవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కోడిగుడ్లు అలాగే అరటి పండ్లు రెండింటిని కలిపి తింటే అరగడం చాలా కష్టమని, తద్వారా జీర్ణక్రియ మందగించి విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

అలాగే  పాలు కోడిగుడ్డు పాలకూర మూడు కలిపి ఒకే సమయంలో తీసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.