
సమ్మర్ సీజన్‌లో చల్లని ఐస్‌క్రీమ్ లేదా కుల్ఫీని తింటే సరదాగా ఉంటుంది. ఈ ఐస్ క్రీం లేదా కుల్ఫీ బాగా గడ్డకట్టినట్లయితే, రుచి రెట్టింపు అవుతుంది. ఫ్రోజెన్ డెజర్ట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రజలకు తెలియదు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు దీనికి చాలా కారణాలున్నాయి. పోషకాహార నిపుణుడు మాక్ సింగ్ ఫ్రోజెన్ డెజర్ట్ కి సంబంధించి అనేక రహస్యాలను బయటపెట్టారు.
ఐస్ క్రీం పేరిట మార్కెట్లో లభిస్తన్న ఫ్రోజెన్ డెజర్ట్ శరీరానికి మంచిదా అంటే కాదు అనే నిపుణులు చెబుతున్నారు. ఫ్రోజెన్ డెజర్ట్ లో చాలా హానికరమైన పదార్థాలు ఉన్నందున వీటిని తినడం హానికరమని అనేక పరిశోధనల్లో తేలింది.
ఫ్రోజెన్ డెజర్ట్ ని ఎందుకు తినకూడదు?
ఫ్రోజెన్ డెజర్ట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని మాక్ సింగ్ అన్నారు. ఇందులో పామాయిల్ కలుపుతారు. పాలకు సంబంధించిన పదార్థాలు ఉండవు. కానీ అది ఐస్ క్రీం పేరిట చెలామణి అవుతోంది. ఇది మాత్రమే కాదు, అవి సంతృప్త కొవ్వుతో నిండి ఉంటాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు. ఫ్రోజెన్ డెజర్ట్ కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, ఇది ధమనుల్లో అడ్డంకులు కలిగిస్తుంది.
ఫ్రొజెన్ డెజర్ట్ ప్యాకేజింగ్‌లో 10.2% వెజిటబుల్ ఆయిల్, వెజిటబుల్ ప్రొటీన్‌లు ఉన్నాయని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. ఈ డెజర్ట్‌లు పాలతో తయారు చేయబడవు, బదులుగా పాల పొడిని ఉపయోగిస్తారు. మిల్క్ పౌడర్‌లో ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది రక్త నాళాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఫ్రోజెన్ డెజర్ట్ తినడం ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు.
ఫ్రోజెన్ డెజర్ట్ లో ద్రవ గ్లూకోజ్ ఉంటుంది, ఇది చక్కెర యొక్క సింథటిక్ మూలం అని మాక్ సింగ్ వివరించాడు. ఫ్రోజెన్ డెజర్ట్ అందంగా కనిపిస్తుంది, సింథటిక్ రుచులు , రంగులను తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. అంతే కాదు, వెజిటబుల్ సోయా ప్రొటీన్, స్టెబిలైజర్లు కూడా దీనిని తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.