అతిగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ నిరంతరం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, డీహైడ్రేషన్, నిద్రలేమి, తక్కువ రక్తపోటు మొదలైన దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. శరీర బరువు పెరగడం, అధిక రక్తపోటు కనిపించడం, నిద్రలేమి సమస్య రావడం, శారీరక, మానసిక సమస్యలు కనిపిస్తాయి. దీనికి తోడు రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె జబ్బులు, కాలేయ సమస్య, స్ట్రోక్, మరికొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా మీరు మీ ఈ ఒక్క అలవాటులో మార్పు తీసుకురావచ్చు. అంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం లేదా రమ్, విస్కీ, బ్రాందీ, బీర్ మరియు వోడ్కాకు బదులుగా వైన్‌ని ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక అవుతుంది.
వైన్ లేదా రెడ్ వైన్ ఇతర ఆల్కహాల్ కంటే ఆరోగ్యానికి తక్కువ హానికరం. ఎందుకంటే ఇందులో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్‌లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.
వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
రెడ్ వైన్ ఆరోగ్యకరమైన పానీయం అని నిరూపించబడింది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
>> రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి మన లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు మరియు ఇన్సులిన్ నిరోధకతను కూడా నియంత్రిస్తాయి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
వైన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
>> రెడ్ వైన్ తాగడం వల్ల మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడం తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దీని వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే >> ద్రాక్షపండు తొక్కలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది, ఇది రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
>> మితమైన మోతాదులో రెడ్ వైన్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్‌లను నివారించవచ్చు.
>> రెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్‌లో ప్రీబయోటిక్స్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.