Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు, చాలా ఇబ్బంది పెడుతుంది. వీటికి అనేక రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అయితే అవిస గింజలను తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు.
అవిస గింజ పోషకాలు- అవిస గింజలు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది సూపర్ ఫుడ్ గాని చెప్పవచ్చు. ఇది మన శరీర నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబరు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా,
బరువు ఎలా తగ్గుతారు- అవిస గింజలను అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. అవిస గింజలను తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. దీని ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారు. దీని వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
ఎలా ఉపయోగించాలి- అవిస గింజలను వేయించుకొని పొడి రూపంలో చేసుకొని పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. లేదా అవిస గింజలను నానబెట్టి ఆపిల్ స్మూతీ తో కలిపి తీసుకోవచ్చు. ఒక కప్పు పాలలో రెండు ఖర్జూరాలను వేసి తర్వాత అవిస గింజల పొడిని మిక్స్ చేసుకొని తాగితే బరువు తొందరగా తగ్గుతారు.
అవిస గింజలను వాడడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండెల్లో బ్లాక్స్ వంటివి కూడా కరిగించడంలో అవిస గింజలు సహాయపడతాయి. షుగర్ ను తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి