Health Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అయితే పెరుగుతో కలిపి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అది విషం గా మారుతుంది. కొన్నిసార్లు తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది .పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పండ్లు- చాలామంది ఆహారంలో పండ్లను చేర్చుకొని పెరుగుతో తింటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు ముఖ్యంగా నారింజ, ద్రాక్షా ,నిమ్మకాయ వంటి సిట్రస్ అధికంగా ఉన్న ఫ్రూట్స్ లలో పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ జీర్ణ సమస్యలు మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పెరుగుతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో పండ్లు తీసుకోకూడదు.
Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా
బంగాళాదుంపలు- బంగాళదుంపలు లేదా ఇతర ఏ దుంపలతో కూడా పెరుగును కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో ఉబ్బరము ఏర్పడుతుంది. బంగాళాదుంపల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండు వేరువేరులో జీర్ణం అయ్యే పదార్థాలు కాబట్టి వీటి కలిపి తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
మాంసాహారం- మాంసాహారంతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో పెరుగు తినకూడదు. దీని వల్ల జీర్ణ క్రియలు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. మాంసాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలపడం వల్ల జీర్ణ క్రియ మందగిస్తుంది. దీని ద్వారా కడుపులో ఉబ్బరము, పొట్టలో నొప్పి ,గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి