TGSRTC Board takes key decision new bus depos and bus stands(X)

Hyd, Jan 27: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ (TRC JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండటంతో బస్‌భవన్‌ లోపల ఈడీ మునిశేఖర్‌కు కార్మిక సంఘాలు సోమవారం నాడు నోటీసు (TGSRTC Strike Notice) ఇచ్చారు. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు (TGSRTC JAC issue strike notice) అందజేశాయి.నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్‌ మోగింది.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు.

ఈ సందర్భంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్‌సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.దీంతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఉన్న డ్రైవర్లనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా పనిభారం కూడా పెరిగిందని కార్మికులు వాపోతున్నారు.

తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 21వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. లేనిపక్షంలో సమ్మె చేసే ఆలోచనలో ఆర్టీసీ సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీల అమలు, సీసీఎస్‌, పీఎఫ్‌ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపు తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్‌ భవన్‌ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.