Filter Coffee World Record (Credits: X)

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో బీపీ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఏర్పడతాయి. దీనికి అధిక రక్త పోటే కారణాలు అయ్యి ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొంతమందిలో ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. సమస్య పెరుగుతుందని కొందరు అంటే కొందరు మాత్రం టీ తాగడం వల్ల బీపీలో ఎటువంటి తేడా రాదని మరికొందరు అంటున్నారు. అయితే ఈరోజు హై బీపీతో ఉన్నవారు టీ తాగాలా వద్దా అనే అంశం గురించి తెలుసుకుందాం.

అధిక రక్తపోటు ఉన్నవారు టీ తాగాలా వద్దా- ఆరోగ్య నిపుణుల ప్రకారం టీ తాగడం వల్ల బిపి పైన పరోక్ష ప్రభావం ఉంటుంది. టీ లో అధిక మొత్తంలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీ తాగడం వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. బీపీ సమస్య ఉన్నవారు పాలు చక్కెర ఉన్న టీ ని తాగడం మానేయాలి. దీని వల్ల దీనివల్ల హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా ఇతర అనేకరకాల సమస్యలు కూడా వస్తాయి.

Health Tips: మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా

గ్యాస్ ప్రాబ్లం- టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్టిక్సమస్య పెరుగుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడడం ద్వారా రక్తనాళాలు ప్రభావితం అవుతాయి. దీని ద్వారా గుండెకు రక్తాన్ని పంపించడంలో ఎక్కువ శ్రమను తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది.

అధిక రక్తపోటు ఉన్నవారు ఏ టీ తాగాలి-  ఉన్నవారు  గ్రీన్ టీ ని తీసుకోవాలి. గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా రక్తనాళాలు కుషించుకపోవు. రక్తనాళాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది..

హెర్బల్.టీ- అధిక రక్తపోటు ఉన్నవారు కెఫిన్ఉన్న టీ ని కాకుండా హెర్బల్ టీను తీసుకుంటే మంచిది.చామంతి టి మందారటి తులసీటి వంటివి కెఫిన్ లేనివి తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు హెర్బల్ టీలు వారికి చాలా సహాయపడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి