Representation Purpose Only (File Image)

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగనిరోధక శక్తితో పాటు మంచి ఆహారం నిద్ర కూడా ముఖ్యం. నిద్రలేమి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. చాలా మంది నిద్రలేమి వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం, అధిక బరువు ,ఒత్తిడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మధ్యాహ్నం పూట ఎక్కువసేపు నిద్రపోకూడదు. అని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే రాత్రిపూట నిద్రలేమిని ఎదుర్కొనేవారు పగటిపూట మధ్యాహ్నం ఒక అరగంట పాటు నిద్రించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్య సమస్యలు తగ్గుతాయి- చాలామందిలో నిద్రలేమి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వారిలో ముఖ్యంగా అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అయితే పగటిపుట ఒక అరగంటసేపు నిద్రపోవడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బీపీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

ఒత్తిడి తగ్గుతుంది- మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు పడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. టెన్షను ఆందోళన వంటివి తగ్గుతాయి. నిద్ర డాపమే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా మీకు ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. రోజులో కనీసం మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రపోవడం వల్ల ఆనందంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.

మానసిక ఆరోగ్యం- మధ్యాహ్నం పూట ఒక చిన్న నిద్రను తీసుకోవడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది కొంచెం శక్తిని ఉత్తేజాన్ని కూడా అందిస్తుంది జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

Health Tips: నెయ్యిలో ఉన్న పోషకాలు తెలుసా 

గుండెకు మంచిది- రోజు అరగంట సేపు మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఇది శరీరంలో ఉన్న రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గుతారు- బరువు తగ్గాలనుకునే వారికి నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అధిక బరువు వల్ల చాలామందిలో నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట సేపు పడుకున్నట్లయితే బరువు కూడా తగ్గుతారు.

ఎంతసేపు ఎప్పుడు నిద్ర పోవాలి- మధ్యాహ్నం మీరు 20 నుంచి 30 నిమిషాల సేపు మాత్రమే నిద్రపోవడం మంచిది. అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల అది రాత్రి నిద్రపైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు కేవలం మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల నిద్ర తీసుకుంటే సరిపోతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి