మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్ని ట్రీట్ మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహారపదార్థాలలో లభిస్తుందని అన్నది ఇప్పుడు తెలుసుకుందామా..
క్యారెట్లు: విటమిన్ -ఎ ఉండే వాటిలో క్యారెట్లు కూడా ఒకటి. ప్రతి రోజు కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారి శరీరానికి అవసరమైన విటమిన్ ఎ లో దాదాపుగా 334 శాతం విటమిన్లు అందుతాయని తాజాగా అధ్యయనంలో వెల్లడించారు. చాలా మంది క్యారట్స్ ని వండుకొని తింటారు. కానీ క్యారెట్స్ లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే క్యాలరీలు అందుతాయని వైద్యులు చెప్తున్నారు. అలా పచ్చివి తినబుద్ది కాకపోతే జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు.
చిలగడ దుంప: అలాగే చిలగడ దుంప లో కూడా విటమిన్" ఎ" సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినడం వలన విటమిన్ ఎ లభిస్తుంది. అలా లేదంటే, చిలగడ దుంప నుంచి రకరకాల పిండి వంటలను చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి.
పాలు: పాలల్లో కాల్షియమే కాకుండా విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజు గ్లాసెడ్ పాలు తాగడం వల్ల మీ స్కిన్ టోన్ కూడా బాగా అభివృద్ది చెందుతుంది.
కోడి గుడ్లు: గుడ్లలో విటమిన్ డి తో పాటు అధికమోతాదులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఈ రెండు విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది.
ఆకు కూరలు: అదే విధంగా ఆకుకూరల్లో కూడా విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలు, విటమిన్లు మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ ఉడికిస్తే అంతా ఎక్కువ మంచిది. ప్రతిరోజు వీటిని మీ ఆహారంలో చేర్చితే శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,
విటమిన్ ఎ అనేది టమాటాల్లో కూడా కావాల్సినంత ఉంటుంది. సాదారణంగా మనరోజువారి వంటకాల్లో టమాట ను ఉపయోగిస్తాం. వంటలలో ఉపయోగించడంతో పాటు టమాట సూప్, టమాట చట్నీ లాంటివి చేసుకొని తింటే అందులోని పోషకాలు శరీరానికి సరిపడేలా అందుతాయి. విటమిన్ ఎ మాత్రమే కాక టమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్లు గుమ్మడదికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. ఇంకా తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజు తినడం వల్ల హర్మోనల్ బ్యాలెన్స్ కి తోడ్పడుతుంది.