ప్రకాశవంతంగా మెరిసే ముఖం కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.అయితే ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కోరిక బలంగా ఉంటుంది. చలికాలంలో చర్మం పొడిబారడం, డ్రై స్కిన్, డీహైడ్రేషన్ సమస్యలతో చర్మం చాలా వికారంగా మారిపోతుంది. ఇక శీతాకాలం వస్తే చాలు కొంతమందిని డీహైడ్రేషన్ సమస్యతో బాధపెడుతుంటది. చలికి వణుకుతూ ఎక్కువమంది తగినంత నీళ్లని తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్ సమస్య తలెత్తుంది. ఈ సమస్య డ్రై స్కిన్ కు దారితీసి చర్మం వికారంగా తయారయ్యేలా చేస్తుంది.
చల్లని వాతావరణం ఉండడంతో శరీరంపై ఉన్న తేమ తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. ఇలా కాకుండ ఉండడానికి కొన్ని ఆరోగ్యకర పానీయాలు సేవించి డీహైడ్రేషన్ బారీనుంచి బయటపడి నునుపైన చర్మం ను సంతరించుకునేలా చేసుకోవచ్చు. అలాగే డ్రై స్కిన్ తో ఇబ్బంది పడేవారు రోజుకు సరిపడినంతా నీళ్లు తాగడం వలన ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
నీళ్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు లభించే గ్రీన్ టీ, విటమిన్ సీ కోసం గోరువెచ్చని లెమన్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ కోసం కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. ద్రవాహారం అధికంగా తీసుకుంటూ మద్యం కేఫీనెటెడ్ డ్రింక్స్ ను దూరం పెట్టాలి. చలికాలంలో ఈ పానీయాలను తాగడం వలన చర్మ నిగారింపును సొంతం చేసుకోవచ్చు.