Amla Murabba (Photo Credits: Wikimedia Commons)

అన్ని జబ్బులకు కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల జలుబు దగ్గు జ్వరము ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా సోకుతాయి. చలికాలంలో వర్షాకాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని మన శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈరోజు మనం అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక చిట్కా గురించి తెలుసుకుందాం. కేవలం చలికాలంలో మాత్రమే దొరికేటువంటి ఉసిరికాయ ఈ ఉసిరికాయలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇది రోగ నిరోధక శక్తిని పెంచి మనకు జబ్బులు రాకుండా చేస్తుంది. ఇందులో ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉంటుంది. పది నిమ్మకాయల్లో ఉండేటువంటి సి విటమిన్ ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకని ఈ ఉసిరికాయ తోటి మన రోగనిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఉసిరికాయ అనేది మనకు సంవత్సరం అంతా కూడా లభించదు. ఎక్కువగా లభించే ఈ సీజన్లో మాత్రమే మనము కొన్ని పద్ధతులు పాటించి సంవత్సరం వరకు కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం, గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్ష

ఉసిరికాయలను తీసుకొని వాటికి చిన్న చిన్న ఘాటు పెట్టి తేనెలో గనక నిలువ ఉంచినట్లయితే అవి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. తేనె కూడా యాంటీ బ్యాక్టీరియాగా యాంటీ ఫంగల్ గా యాంటీ ఇన్ఫ్లమేటర్ లక్షణాలు కలిగి ఉంటుంది. తేనె అనేది నాచురల్ యాంటీబయటిక్ తేనె కూడా మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ రెండిటిని కలిపిన మిశ్రమము ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

ప్రతిరోజూ పరగడుపున ఒక ఉసిరికాయను తేనెతో తేనెలో ముంచి ఉంటుంది కాబట్టి తేనెతో కలిపి తీసుకుంటే మీకు రోగ నిరోధక శక్తి అనేది అమాంతం పెరుగుతుంది దీన్ని మీరు ఈ సీజన్ తో పాటు ఉసిరికాయ లభించే నటువంటి సీజన్లో కూడా వాడుకోవచ్చు ఇంకో విధంగా కూడా మనము ఈ ఉసిరికాయను నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువగా దొరికేటువంటి ఈ సమయంలో తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే వరుగుల్లాగా అవుతాయి.

వాటిని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయము ఒకటి తిన్నట్లయితే మీ రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది ఈ పద్ధతులు పాటిస్తూ మీరు గనక ఉసిరికాయని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది