దేశంలో కరోనా విలయతాండవం రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. భారత్‌లో 24 గంటల్లో లక్షా 38వేల 331మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయలో 314 మంది మరణించారు. లేటెస్ట్ పెరుగుదలతో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50 వేల 377కి పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,50,85,721కి చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,86,066కి చేరుకుంది. అదే సమయంలో, ఓమిక్రాన్ కేసులలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,743 కేసులు నమోదయ్యాయి. దేశంలో నిన్నటి కంటే 2,369 ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 2లక్షల 68వేల 833 కరోనా కేసులు నమోదయ్యాయి.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/choZMigFeE pic.twitter.com/HBR9j7iB2H
— Ministry of Health (@MoHFW_INDIA) January 16, 2022
156 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందించారు...
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏడాది కాగా.. ఇప్పటివరకు 156 కోట్లకు పైగా యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7వేల 743కి చేరుకుంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.