International Condom Day: ఒక కండోమ్ మీ జీవితాన్నే మార్చేయవచ్చు! నేడు అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం, ఈరోజుకున్న ప్రత్యేకత మరియు సురక్షితమైన రీతిలో కండోమ్ ధరించే పద్ధతిని తెలుసుకోండి
How To Wear Condoms (Photo Credits: Pixabay)

అసలు కండోమ్ ధరించడం ఎలా? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక కండోమ్ మీ జీవితాన్నే మార్చేయవచ్చు. ఈరోజు అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం. ప్రతి ఏడాది ఫిబ్రవరి 13న అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం (International Condom Day) నిర్వహించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (AHF) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ప్రత్యేక థీమ్‌లతో, వివిధ ఈవెంట్లను మరియు సామాజిక కార్యక్రమాలను రూపొందిస్తూ సురక్షితమైన శృంగారానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పిస్తుంది. ఇదే కండోమ్ దినోత్సవం నిర్వహించడం వెనక ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది 2020 ఖరారు చేయబడిన థీమ్ - సేఫర్ ఈజ్ సెక్సీ అంటే సురక్షితమే అందం.

మరి సురక్షిత శృంగారంలో కండోమ్‌లు ఎలాంటి ముఖ్యపాత్ర పోషిస్తాయో మీ అందరికి తెలుసు. ఇక్కడ మగవారి కండోమ్ల గురించి చెప్పుకుంటే, శృంగార సమయంలో కండోమ్లు నిటారుగా ఉన్న పురుషాంగం నుండి జారడం ఒక సాధారణ సమస్య. కండోమ్ ధరించినప్పుడు అంగస్తంభన కోల్పోవడం అది మరింత నిరాశపరుస్తుంది. అలాంటి సమయంలో కండోమ్‌పై వెనకడుగు వేస్తే అది వీరుడి లక్షణం అనిపించుకోదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కండోమ్‌ను విస్మరించకూడదు, అలా చేస్తే యుద్ధంలో వీరుడు తన చేతిలోని కత్తిని వదిలేసినట్లే.

Condom day (Photo Credits: File Image)

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా, కండోమ్‌ను సరైన రీతిలో ధరించడమనే సమస్య పరిష్కారం అవడమే కాకుండా మేలైన భావప్రాప్తి కలగడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా వాలెంటైన్స్ డేకి ముందు ఈ ప్రిపరేషన్స్ అవసరం అని గుర్తుంచుకోండి. :పి

సమయం తీసుకోండి మిత్రమా.. రణమైనా, శృంగారమైనా. ఈ కండోమ్‌లు జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పని ఆదరాబాదరాగా చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలి. కండోమ్ ధరించడంలో వచ్చే వరుస క్రమాన్ని పరిశీలిద్దాం.

How To Wear A Condom?!

  • ముందుగా కండోమ్ చిరిగిపోకుండా ఉండే విధంగా కండోమ్ ప్యాక్ తెరవండి.
  • కండోమ్ యొక్క చుట్టిన బయటి అంచును మీ నిటారుగా ఉన్న పురుషాంగం మీద ఉంచి రోల్‌ను సౌకర్యవంతంగా వెనక్కి, లేదా క్రిందికి లాగగలిగేలా చూసుకోవాలి. ఇప్పుడు మీ పురుషాంగం యొక్క పునాది వైపుకు లాగండి.
  • కండోమ్ విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి మీ గోళ్లు కండోమ్‌ను తాకకుండా జాగ్రత్తపడండి. ఇంతే!
  • ఇక మీరు మీ కార్యం పూర్తి చేసిన తర్వాత బేస్ నుంచి పట్టుకొని జాగ్రత్తగా బయటకు తీయండి. శుక్రద్రవం లేదా స్పెర్మ్ బయటకు లీక్ అవ్వకుండా దాని అంచున ముడి కట్టి డస్ట్‌బిన్‌లో విసిరేయండి.
  • ఒకవేళ కార్యం మధ్యలోనే కండోమ్ చినిగిపోతే అప్పుడెలా? కంగారు పడొద్దు, మూడ్ కోల్పోవద్దు అది తీసేసి కొత్తది ఉపయోగించడి, అనుమానం ఉంటే వెంటనే స్త్రీ జననేంద్రియాలను కడగాలి, అత్యవసర గర్భనిరోధక మాత్రలను ఎంచుకోండి.

అలాగే, కండోమ్‌లలో స్పెర్మిసైడ్ అనే ముఖ్యమైన పదార్థం గురించి మీకు తెలుసా? ఇది వీర్యకణాలలో ఉన్న స్పెర్మ్‌లను చంపే స్పెర్మిసైడల్ కందెనతో పూతపూయబడి ఉంటుంది. డ్యూరెక్స్ మరియు మ్యాన్‌ఫోర్స్ వంటి బ్రాండ్లు ఇలాంటి కండోమ్‌లను విక్రయిస్తాయి, ఇవి మీకు గర్భం నుండి 100 శాతం రక్షణను కల్పిస్తాయి.

మరో ముఖ్య విషయం తెలియని వ్యక్తులతో మరియు ఎక్కువ మందితో శృంగారం ఎంత మాత్రం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అది చట్టరీత్యా నేరం కూడా