Onion War In AP Assembly AP CM YS Jagan About Onions Prices In Andhra pradesh(Photo-ANI)

ఉల్లిగడ్డ (Onion)  చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అది నిజమే. ఉల్లిగడ్డలో (Onion) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లిగడ్డను (Onion) తినడం వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. అందుకే.. ఉల్లిపాయలను రోజూ కూరల్లో వేసుకొని వండుకొని తింటాం. ఏ ఆహారమైనా అందులో ఉల్లిగడ్డ (Onion) ఉండాల్సిందే. చిరుతిళ్లలోనూ ఊల్లిపాయ (Onion) ముక్కలు ఉండాల్సిందే. అది ఉల్లిపాయకు ఉన్న క్రేజ్. ఉల్లిగడ్డ మాత్రమే కాదు.. ఉల్లిపాయ రసంలోనూ (Onion Juice) చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. ఎన్నో రకాల సమస్యలను కేవలం ఉల్లి రసంతో చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఉల్లిపాయ రసంతో (Onion Juice) ఎటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి. ఉల్లిగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వాటినే క్వెర్ సెటిన్ అని పిలుస్తారు. అది మెటబాలిజం రేటును పెంచుతుంది. దాని వల్ల.. శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉల్లిగడ్డలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఉల్లిగడ్డను ఖచ్చితంగా ప్రతి కూరలో వేసుకొని తింటారు.

శొంఠి ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు, ఎలా వాడాలో తెలుసా, చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఔషధం ఇదే...

చాలామంది తమ పొట్టను తగ్గించుకోవాలని అనుకుంటారు. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి. అలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దానికోసం.. ఉల్లిపాయ రసాన్ని ఎలా తయారు చేయాలంటే… ఉల్లిగడ్డను తీసుకొని.. ముక్కలు ముక్కలుగా చేసి.. మిక్సీలో వేసి బాగా మొత్తగా చేసి.. ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి కలపాలి. దాంట్లో కాసింత తేనె వేసి నిత్యం తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని ఉదయమే పరగడుపున తాగాలి. దీంతో పొట్ట తగ్గుతుంది. ఉల్లిపాయ రసం తాగడం వల్ల.. పొట్ట తగ్గడం మాత్రమే కాదు.. జలుబు ఉన్నా.. దగ్గు ఉన్నా.. జ్వరం వచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిరసాన్ని నిత్యం తీసుకోవాలి. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉల్లిపాయ రసంతో తగ్గించవచ్చు.