గత కొన్ని దశాబ్దాలుగా ఊపిరితిత్తుల కేన్సర్ తన స్వరూపం, స్వభావాలను మార్పుకుంటూ వస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మగవారిలో పొగతాగేవారిని, వృద్దులను మాత్రమే ఎక్కువ కబళిస్తుండగా, ఇప్పడు యువతకు, ఎప్పుడు పొగతాగనివారికి, మహిళలకు వస్తోందని పేర్కొంటున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరిలో క్యాన్సర్ మరణాల్లో ఎక్కువశాతం కారణం ఊపిరితిత్తుల క్యాన్సరని చెబుతున్నారు. ఈవ్యాధి రావడానికి ప్రధాన కారణంగా సిగరేట్లు కాల్చడమేనని, మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 80శాతం దానితో వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దేశంలో పొగతాగనివారిలో ప్రమాదకర స్దాయిలో క్యాన్సర్ పెరుగుతోందని, రొమ్ము, పాంక్రియాటిక్, ప్రొస్టేట్ క్యాన్సర్లన్నింటివల్ల సంభవించే మరణాల కంటే కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలు ఎక్కువ.
పోగతాగనివారిలోను ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య 30నుంచి 40శాతం పెరిగిందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వాయు కాలుష్యంతోనే పొగతాగని యువత, మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమని, వంటనూనెల నుంచి వచ్చే ఆవిర్లు, బొగ్గు, పొయియ, పొగ, ఇతరులు సిగరేట్లు కాల్చినప్పుడు వచ్చే పొగ, వాయుకాలుష్యం, బయోమాస్ ఇంధనాలతో పొగతాగనివారిలో, మహిళల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని చెబుతున్నారు. 30నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కలు, అసలు పొగతాగనివారిలో పర్యావరణ, జన్యుపరమైన కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నట్లు, వాయు నాణ్యత, కాలుష్యంతో కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాలు సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు.
పొగతాగనివారి కంటే, పొగతాగేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్లలో రకాలు వేర్వేరుగా ఉంటాయని, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లు పొగతాగేవారికే వస్తుండగా, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లు పొగ తాగనివారికి వస్తున్నాయంటున్నారు. ఎప్పుడు పొగతాగనివారిలో మరణాలు 20శాతం కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్. పొగతాగడంతో పాటు కుటుంబ చరిత్ర, జన్యు కారణాలతో కూడా ఇది వస్తోందని, క్యాన్సర్ బాగా ముదిరిపోయి, ఇతర ప్రాంతాలకు వ్యాపించిన పరిస్దితుల్లోనే చాలా కేసులు కనిపిస్తున్నాయంటున్నారు. వీరికి శస్త్రచికిత్స, కెమోథెరపీ, రేడియేషన్‌తో పెద్దగా ఫలితాలుండవని, లక్షణాలు చాలావరకు తగ్గి, కోలుకునే అవకాశాలు కొంతవరకు ఉంటాయని, ముందుగా గుర్తిస్తే మరణాలను 20శాతం వరకు తగ్గించవచ్చన్నారు.