Neem Tea: వేపఆకు టీతో కలిగే లాభాలు ఇవే, రక్త శుద్ధి మాత్రమే కాదు, సకల రోగ నివారిణి కూడా..
(Representational Image) Image: Twitter

Neem Tea: వేపాకు టీ.. ఈ పేరు వినగానే మీ మొహం చిరాకుగా అయిపోతుంది. కానీ ఇది హెర్బల్ టీ. వేపాకును ఔషధ గనిగా చెప్తూంటారు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇదే క్రమంలో వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక కప్పు వేప టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవి.

వేపాకులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. ఇందుకు కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దాన్ని చల్లారనివ్వాలి. షాంపుతో తలస్నానం చేసాక.. మరిగించి చల్లార్చిన వేపాకు నీటితో మరోసారి శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలాంటి ఔషధ గుణాలు నీమ్ టీ సొంతం. అయితే.. నీమ్ టీని గర్భిణిలు తాగొద్దు. డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమం. బాలింతలు కూడా వేపాకు టీ తాగకూడదు. వీరితోపాటు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు.. కొన్ని రోజుల క్రితమే శస్త్రచికిత్స చేయించుకున్నవారు వేపాకు టీ తాగకుండా ఉండాలి. వేపాకు టీని.. రెండు కప్పుల నీటిలో 6-10 వేపాకులు వేసి మరిగించాలి. చేదు పోగొట్టుందుకు అందులో బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. మరుగుతున్న నీళ్లు లైట్ గ్రీన్ కలర్‌లోకి వచ్చాక దించేసి.. వేడి వేడి నీమ్ టీ తాగేయడమే.