Non Stick Pan Disadvantages: నాన్ స్టిక్ పెనంపై వేసిన దోస వేసి తింటున్నారా, అయితే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే చాన్స్..
(Representational Image) Image: Twitter

Non Stick Pan Disadvantages: దోశ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. దోశలో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే దోశ ఏదైనా సరే ఇనుప పెనం పై వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దోశ పిండి పెనంకి అంటుకోవడం, దానివల్ల దోశ సరిగా రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడో ఒక సారి, రెండు సార్లు అయితే బానే ఉంటుంది కానీ తరచుగా ఈ సమస్య వస్తూ ఉంటే ఒక్కొక్కసారి చిరాకుగా ఉంటుంది. అందుకే దాదాపు అందరూ ఇనుప పెనం నుండి నాన్ స్టిక్ పెనంకి షిప్ట్ అయ్యారు. దీనిపై పిండి అంటుకోవడం లాంటి సమస్య ఉండదు. దాంతో దోశలు సులభంగా వేయొచ్చు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అది ఎలాగంటే’ నాన్ స్టిక్ ప్యాన్ పై పిండి వేసిన తర్వాత అంటుకోకుండా దోశ రావడానికి ముఖ్య కారణం ఆ ఆ పెనం మీద ఉండే కోటింగ్. ఆ కోటింగ్ టెఫ్లాన్ తో వేస్తారు. టెఫ్లాన్ అనేది ఒక రసాయన పదార్థం. ఇలా కెమికల్స్ తో తయారైన నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్యాన్ వేడి చేయడం వల్ల టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల కెమికల్ అనేది మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.