Rep Image (File Image)

మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు. ఊదారంగు కార్న్‌లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్ మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు. అంతేకాదు, ఇందుకోసం వీరు అన్ని రంగుల మొక్కజొన్నల్నీ తీసుకుని వాటిని వర్గాలుగా విభజించిన ఎలుకలకి కొంతకాలం పాటు ఇచ్చారట. అన్ని రకాల మొక్కజొన్నల్లోని ఆంథోసైనిన్ల వల్లా రోగనిరోధకశక్తి పెరిగిందట. క్లోమగ్రంథి పనితీరూ మెరుగైనట్లు గుర్తించారు.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

కానీ ఊదారంగు మొక్కజొన్నల్ని తిన్నవాళ్లలో అది మరింత ప్రభావశీలంగా పనిచేయడంతో మధుమేహం పూర్తిగా అదుపులో ఉన్నట్లు తేలింది. దాంతో ఆ రంగు మొక్కజొన్నల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని సదరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.