The Surprising Risks of Sleeping Too Much ( Photo-File Image)

జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. వైద్యలు కూడా కంటి నిండా నిద్రపోతే ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతుంటారు. కొంతమంది పని పూర్తి చేయడానికి నిద్రతో రాజీపడతారు. మరికొందరు వర్క్ షిఫ్ట్ వల్ల నిద్రను (Sleep Deprivation) వదులుకోవాల్సి వస్తుంది. ఇక చుట్టుపక్కల వాతావరణం కారణంగా కొంతమందికి నిద్ర (When You Don't Get Enough Sleep) తక్కువగా ఉంటుంది.

పని ఒత్తిడి మొదలైన వాటి వల్ల 8 గంటల నిరంతర నిద్ర రాకపోతే తక్కువ వ్యవధిలో పూర్తి చేస్తూ ఉంటారు. దీనితో, విడతల వారీగా 8 గంటల నిద్రను పూర్తి చేస్తారు. ప్రధానంగా 4, 5 గంటలు నిద్రపోతే, మధ్యాహ్నం ఒక గంట లేదా రెండు గంటల నిద్రతో మిగిలిన నిద్రను భర్తీ చేయవచ్చు. ఇలా పడుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో అంతరాయం కలిగితే స్వల్పకాలిక నిద్రను పోవాల్సి వుంటుంది. కాలేయాన్ని పాడు చేసే పదార్థాలు, లివర్‌ని కాపాడే ఆరోగ్య పదార్థాలు ఇవే, ఏవి తినాలి, ఏవి తినకూడదనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి

రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సక్రమంగా పనిచేయడమే కాకుండా.. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనికి అనాటమీ కూడా ఉంది. నిద్ర మొదటి దశ మంచిగా రాత్రి నిద్ర పొందడం. ఈ దశ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండో దశ తేలికపాటి నిద్ర.. ఇందులో శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.. కంటి కదలిక ఆగిపోతుంది. ఈ దశ 10-25 నిమిషాలు ఉంటుంది. మూడో దశ స్లో వేవ్ స్లీప్ అయితే.. మూడో దశ నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. నిద్ర లేకపోవడం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, అశాంతికి దారితీస్తుంది.