Explosion in Parked Car Sparks Fire Near Red Fort Metro Station in Delhi (Photo Credits: X/ @PTI_News)

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన పేలుడు ఘటన (Delhi Blast) కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరో సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఎర్రకోట క్రాసింగ్‌ వద్ద వాహనాలు సిగ్నల్‌లో నెమ్మదిగా కదులుతుండగా, ఒక్కసారిగా హ్యుందాయ్‌ ఐ20 కారు పేలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, చుట్టుపక్కల వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ భయానక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయి, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఈ ఘటన తర్వాత రెడ్‌ ఫోర్ట్‌ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దర్యాప్తు సంస్థలు ఈ పేలుడు ఘటనపై విచారణను వేగవంతం చేశాయి. ప్రారంభ దర్యాప్తులో దుండగులు ఘటనకు ముందు పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు ఆధారాలు లభించాయి. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగించనున్నారు. ఆ రోజు పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

CCTV Shows Car Explosion Near Red Fort

తాజాగా ఫరీదాబాద్‌లో పోలీసులు ఛేదించిన టెర్రర్‌ మాడ్యూల్‌‌తో ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ మాడ్యూల్‌లో కీలక పాత్రధారి ఉమర్ పేలుడు కారుకు సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అతడు పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.