Representational Image| Semi- Vegetarianism| Photo: Twitter

పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు... మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధి బద్ధకాన్నీ ఫ్లష్ చేసేస్తుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ కేన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసేరకానికి చెందిన పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పీచు పదార్థాలు: మొక్కల ఉత్పత్తులైన చిక్కుళ్లు, పళ్లు, కొన్ని రకాల కూరగాయల్లో నీరు, పీచు శాతం ఎక్కువ. ఇవి తిన్నప్పుడు మన శరీరం వీటిలోని పీచును జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో మెటబాలిజమ్ పెరుగుతుంది. ఫలితంగా శరీరం బరువు తగ్గుతుంది.

యాపిల్స్: యాపిల్స్‌లో పీచు పదార్థం ఎక్కువ. సైజునిబట్టి ఒక్కో యాపిల్‌లో 2 నుంచి 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే వీటిని తొక్క తీయకుండా తింటేనే, పూర్తి ఫైబర్‌ని పొందగలం. రోజులో ఏదో ఓ సమయంలో కనీసం ఒక్క యాపిల్ అయినా తినాలి.

బనానా: పొటాషియంతోపాటు అరటిపళ్లలో ఫైబర్ కూడా ఉంటుంది. ఒక అరటిపండులో 3 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఉదయాన్నే ఒక అరటిపండు తినాలి.

మినుములు: ఒక కప్పు మినుముల్లో 30 గ్రాముల పీచు ఉంటుంది. కాబట్టి అల్పాహారంగా మినుములతో కూడిన దోసె, ఇడ్లీలాంటివి తీసుకోవాలి.

బ్రొకోలి: రోజూ ఇతర కూరగాయలతోపాటు తప్పనిసరిగా ఒక కప్పు బ్రొకోలి తీసుకుంటే రోజుకి సరిపడా ఫైబర్ అందుతుంది.

క్యాబేజీ: ఇందులో విటమిన్-సితోపాటు ఫైబర్ కూడా ఎక్కువే! క్యాబేజీని సూప్, సలాడ్, స్మూదీ… రూపంలో తీసుకోవాలి.

క్యారెట్స్: బీటా కెరొటిన్‌తోపాటు పీచు కూడా క్యారెట్లలో ఎక్కువ. పచ్చిగా కానీ, ఆవిరి మీద ఉడికించి కానీ తింటే దీన్లోని ఫైబర్‌ని పూర్తిగా పొందుతాం.