
New Delhi, July 16: చిన్నారులు స్నానం చేసిన తరువాత చెవులను(Ears) శుభ్రం చేసేందుకు ఉపయోగించే కాటన్ బడ్స్(cotton buds) పిల్లలకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. ఇది చెవికి గాయం కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది భారతీయలు సాధారణంగా ఆదివారం రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు గోళ్లు కత్తిరించటం, చెవులు శుభ్రం (Cleaning ears) చేసుకోవడం, జుట్టుకు నూనె రాయడం మొదలైనవాటిని చేస్తుంటారు. చెవులను శుభ్రపరిచే ప్రాథమిక సాధనంగా కాటన్ బడ్స్ ను (cotton buds) , పిన్నీసులను ఉపయోగిస్తుంటారు. చెవులను శుభ్రం చేసేందుకు ఉపయోగించే కాటన్ బడ్స్ కారణంగా పిల్లల చెవుల్లో గాయాలు అవుతున్నట్లు పిల్ల వైద్యులు చెబుతున్నారు. చెవులను శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్‌ని ఉపయోగించడం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో చెవిలో బడ్స్ కారణంగా ఏర్పడి చిన్నగాయం పెద్దదిగా మారి చివరకు వినికిడి శక్తిని చిన్నారులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. చెవి లోని వినికిడి ఎముకలు, లోపలి చెవికి దెబ్బతగలటం వంటి కొన్ని తీవ్రమైన కేసులు ఇప్పటికే అనే మంది నమోదయ్యాయి. ఈ పరిస్ధితి చిన్నారుల్లో కోలుకోలేని వినికిడి నష్టానికి దారితీస్తుంది.
చెవిలోపలి భాగంలో చర్మంపై సున్నితమైన మైనపు పూత ఉంటుంది. ఇది చెవి రక్షణకు సహాయపడుతుంది. కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే ఇయర్‌వాక్స్ క్లీనర్ అయినందున చెవి లోపలి భాగాన్ని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా నమలడం, దవడ కదలికలు, చెవి లోపల చర్మం పెరగడం గుమిలి సహజంగా బయటకు నెట్టివేయబడుతుంది. ప్రత్యేకించి దానిని కాటన్ బడ్ తో శుభ్రం చేయాల్సిన పనిలేదు.
కాటన్ బడ్ ను ఉపయోగించటం వల్ల సున్నితమైన చెవిలోపలి చర్మం, కర్ణభేరి తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. చెవిలో నొప్పి,దురద, చెవి నిండుగా ఉన్న భావన, చెవిలో రింగింగ్ శబ్ధాలు, వినికిడి లోపం ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.