ఉప్పు ఎక్కువగా తినడం వలన కలిగే అనర్ధాలు తక్కువ కాదు. అలా అని ఉప్పు అస్సలు తినకపోయినా మంచిది కాదు, తినడానికి రుచి కూడా ఉండదు. పూర్వం ఎక్కువ శాతం మనుషులు కష్టించి పని చేసేవారు. వారికి చమట రూపంలో పోయిన కనిజ లవణాలను, ఉప్పు రూపంలో మళ్ళీ తీసుకునేవారు. కాని ఇప్పటి పరస్థితి అలా కాదు. మనిషికి మైండ్ తో పని ఎక్కువ ఉంటుంది కాని, ఒంటికి అలసట కలిగే పనులు తక్కువగా ఎన్నుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఉప్పు తినడం అస్సలు మంచిదికాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం రోజుకు 5 గ్రాముల ఉప్పు చాలని అంటుంటే, ఇప్పుడు మనిషి దాదాపుగా 11 గ్రాముల ఉప్పు తింటున్నాడని సర్వేలో తేలింది. అంటే డబుల్ కంటే ఎక్కువే తింటున్నాం. ఉప్పు ఎక్కువుగా తినడం వలన బ్లడ్‌ప్రెషర్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోవాస్కులర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్,స్టమక్ క్యాన్సర్, ఒబేసిటీలకు దారి తీస్తుంది.
అసలు ఏ ఐటం తింటే ఎంత ఉప్పు తింటున్నామో తెలుసుకుందాం. ఒక స్లయిస్ బ్రెడ్ లో 150 మిల్లీగ్రాములు, కప్పు నూడుల్స్‌లో 200 మల్లీ గ్రాములు, చిన్న కప్పు పాప్‌కార్న్‌లో 100 మి.గ్రా, చిన్న కప్పు వేయించిన పల్లీలలో 125 మి.గ్రా, నమ్కీన్ లేదా మిక్చర్ ఒక స్పూన్ తింటే 300 మి.గ్రా, ఒక సాల్ట్ బిస్కట్ తింటే 300 మి.గ్రా ముల ఉప్పు కడుపులోకి పోతుంది. ఒక స్పూన్ ఊరగాయ లో వెయ్యి మిల్లీ గ్రాముల ఉప్పు ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతీ రోజు ఏ ఐటం ఎంతవరకు తినచ్చు అనే విషయాన్ని అర్ధం చేసుకుని దానిని బట్టి తింటే మంచిది.