అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? ఈమధ్య కాలంలో అందంగా తయారుకావడం కోసం జనాలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. మగవారైనా, ఆడవారైనా మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఖరీదైన లోషన్లు, బ్యూటీ క్రీములు, ఫేస్‌ప్యాకులు (Face packs) అన్నీ ట్రై చేస్తున్నారు. ఇంకొంతమందైతే తాము అందంగా కనిపించడం కోసం సర్జరీ చేసుకోవటానికైనా సిద్ధపడుతున్నారు. ఇదే క్రమంలో తమ బాహ్య సౌందర్యం మరింత పెంచుకునేందుకు కొత్తకొత్త ప్రయోగాలనూ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకూ దారితీసిందంటే అలాంటి ప్రయోగాలలో భాగంగా మగవారి వీర్యాన్ని (Semen/ Sperm Cells) కూడా తమ ముఖానికి ఫేస్‌ప్యాక్ (Semen Facial) లాగా పూసుకోవడం ప్రారంభించారు.
ఇప్పటివరకూ సంతానోత్పత్తి కోసమే ఉపయోగిస్తున్న వీర్యాన్ని ఇప్పుడు సౌందర్య సాధనాలలో ఒకటిగా కూడా ఉపయోగిస్తున్నారు. విదేశాలలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది హాలీవుడ్ సెలబ్రిటీలకు బ్యూటీషియన్లుగా పనిచేసే వారు ఈ విషయం నిజమేనని వెల్లడించారు. మగవారి వీర్యంతో వయసు పెరగడంతో (Ageing) వచ్చే ముడతలు (Wrinkles) తగ్గించటమే కాకుండా చర్మం ప్రకాశవంతం (Blemish) అవుతుందని వారి నమ్మకం. అందుకే చాలా మంది వీర్యాన్ని ఫేస్‌ప్యాక్ లా పెట్టుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఇప్పటివరకూ ఎన్నో కథనాలు, యూట్యూబ్ వీడియోలు పబ్లిష్ అయ్యాయి.
స్పెర్మ్ ఫేషియల్ పై వచ్చిన కథనాలు, యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలు, బ్యూటీ జర్నల్స్ లో వారు తెలిపిన వివరాలన్నింటిని క్రోడికరించినప్పుడు తెలిసింది ఏమిటి అంటే? వారి కథనాల ఆధారంగా...
మగవారి వీర్యంలో కొన్ని రకాల విటమిన్లు, స్పెర్మైన్ (spermine) అనే యాంటీ-ఆక్సిడెంట్, ప్రోటీన్ కంటెంట్లు ఉంటాయి.ఇవి చర్మం పొడిబారకుండా చర్మంలో తేమను నిలిపి ఉంచేలా చేసి, చర్మంలో వేడిని తగ్గిస్తుంది. తద్వారా ముఖంపై ముడతలు రాకుండా ఉండి, కాంతివంతంగా తయారు అవుతుంది.
ఇందులో నిజమెంత?
అయితే మగవారి వీర్యకణంలో పైన చెప్పిన ప్రోటీన్, యాంటీ- ఆక్సిడెంట్ కంటెట్స్ ఉండటం నిజమే కానీ, అవి చర్మానికి మేలు చేస్తాయి అని ఇప్పటివరకు ఎక్కడా సైంటిఫిక్ గా రుజువు కాబడలేదని 'నేచురల్ సెల్స్ బయోలజిస్టులు' (Nature Cell Biology) చెప్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేసే బదులు ప్రస్తుతం సైంటిఫిక్ గా నిరూపించబడిన ప్రొడక్ట్స్ నే వాడితే మంచిదని సలహా ఇస్తున్నారు.
స్పెర్మిడైన్ (spermidine) ని చర్మ కణాల్లోకి ఇంజెక్ట్ చేయడం వలన కొంతవరకు ముడతలు తగ్గించవచ్చు కానీ, నేరుగా ముఖానికి పూసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలుండవని పేర్కొన్నారు. వీర్యంతో ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు చర్మంపై చెడు ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. వీర్యదాత సరైన ఆరోగ్య నియమాలను పాటించని సందర్భాల్లో వ్యాధులు (STDs - Sexually Transmitted Diseases) వ్యాప్తి చెందే ప్రమాదమూ ఉందని వారు హెచ్చరిస్తున్నారు.