ATM Theft: ఇదేందయ్యా.. ఇది? మరీ ఇంత కాస్ట్ లీ దొంగతనమా?? విమానంలో వెళ్లి ఏటీఎం నుంచి రూ.10.72 లక్షలు చోరీ.. ఇద్దరు అరెస్ట్‌.. అహ్మదాబాద్‌లో ఘటన
Representational Image

Newdelhi, Oct 2: విమానంలో (Plane) ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఎం (ATM) నుంచి రూ.10.72 లక్షల డబ్బు చోరీ చేశారు. ఆ తర్వాత విమానంలో మరో ప్రాంతానికి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు (Police) ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ (Arrest) చేశారు. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. గత నెలలో అమ్రైవాడి ప్రాంతంలోని ఏటీఎంను పగులగొట్టిన దొంగలు అందులో ఉన్న రూ.10.72 లక్షల విలువైన నోట్ల కట్టలను లూఠీ చేశారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ చోరీపై దర్యాప్తు జరిపారు. పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చండీగఢ్‌ నుంచి విమానంలో అహ్మదాబాద్‌కు చేరుకుని ఈ దొంగతనం చేసినట్లు తెలుసుకుని షాక్‌ అయ్యారు.

Pawan Kalyan Varahi Yatra: సీఎం జగన్‌ అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు! నా సినిమాలు ఆపాలనుకుంటే...ఆపండి, అవనిగడ్డలో సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

గూగుల్‌ మ్యాప్‌ ద్వారా..

ఆ ఇద్దరు నిందితులు నకిలీ ఆధార్‌కార్డుల ద్వారా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో హోటల్‌ బుక్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ద్విచక్ర వాహనం, గ్యాస్‌ కట్టర్లు, ఆక్సిజన్‌ సిలిండర్‌ కొనుగోలు చేసినట్లు చెప్పారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎంపిక చేసిన ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న రూ.10.72 లక్షల నగదును దోచుకున్నారని వెల్లడించారు. ఈ చోరీ అనంతరం విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు వివరించారు. నిందితులిద్దరూ విమానాల్లో ప్రయాణించి ఏటీఎంలు చోరీ చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు.

Viral Video: బైక్ నడుపుతూ సీటు మీద నిల్చున్నాడు..ఇంతలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గువరడం ఖాయం..