Jon Landau (Credits: X)

Newdelhi, July 7: హాలీవుడ్‌ లో (Hollywood) విషాదం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డులను (Oscar Awards) అందుకొన్న ప్రఖ్యాత చిత్రరాజాలు  ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ జాన్ లాండౌ (Jon Landau) మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించినట్టు  ఆయ‌న కుటుంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. జాన్ లాండౌ మృతిప‌ట్ల దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్, సామ్ వ‌ర్తింగ్స్‌ ట‌న్ త‌దిత‌రులు సంతాపం ప్ర‌క‌టించారు.

టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చ‌నిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్, రెండు రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం

నిర్మాణంలో అద్భుతమే

జాన్ లాండౌ వయసు 63 ఏండ్లు. 1980లో ప్రొడక్షన్ మేనేజర్ ​గా కెరీర్ ప్రారంభించిన జాన్.. టైటానిక్ సినిమాతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో నిర్మించిన ఈ సినిమా కోసం అప్ప‌ట్లోనే ఆయన 200 మిలియ‌న్ల బ‌డ్జెట్‌ ను పెట్టగా.. సూమారు రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ చిత్రానికి క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే కాకుండా 11 ఆస్కార్ అవార్డులు ద‌క్కించుకుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతం అవతార్ సినిమాకు కూడా ఈయనే నిర్మాత.

ఆస్ప‌త్రిలో షూటింగ్ చేసినందుకు పుష్ప విల‌న్ పై కేసు న‌మోదు, సుమోటోగా స్వీక‌రించిన కేర‌ళ మాన‌వ‌హ‌క్కుల సంఘం