Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.
Newdelhi, Feb 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ' వెల్‌కం యూనియన్ బడ్జెట్ 2025' (Welcom Union Budget 2025) అని నిర్మలా సీతారామన్ సైకతాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కాగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించి, వినియోగం తగ్గుతున్న సమయంలో, ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో, రూపాయి పతనం, పసిడి పరుగులు కొనసాగుతున్న నేపథ్యంలో నేటి బడ్జెట్ ను అటు ఆర్ధిక నిపుణులు, సామాన్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గత బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ 'వికసిత్ భారత్' కోసం రోడ్ మ్యాప్ ను రూపొందించారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఈ సారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నదన్న విషయంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
‘బడ్జెట్ సైకత శిల్పం’
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్ pic.twitter.com/ezxynBOKuK
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025
మధ్యతరగతి ఆశలు
మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ బడ్జెట్ కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీని గురించి మాట్లాడుతూ.. మహాలక్ష్మి మంత్రాన్ని జపించడంతో అంచనాలు మరింత పెరిగాయి. పేద, మధ్య తరగతి వారు తమకు కొత్త పథకాలు తెస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే వేతన జీవులు.. పన్ను మినహాయింపులు పెంచుతారని ఎదురుచూస్తున్నారు. గత మధ్యంతర బడ్జెట్ సమయంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచిన కేంద్రం.. ఈసారి కూడా మరింత పెంచుతుందని అంచనాలు ఉన్నాయి. ఇంకా టాక్స్ రిబేట్ కూడా పెంచి మధ్యతరగతి, వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 01, 2025 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

