
Hyderabad, FEB 28: రాంగ్ రూట్ లో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడిన మహిళ సినీనటి సౌమ్య జానుగా (Sowmya Janu) బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ఈనెల 24న రాత్రి బంజారాహిల్స్ రోడ్ 12లోని అగ్రసేన్ కూడలిలో రాంగ్‌రూట్‌లో జాగ్వర్ కారులో వచ్చిన మహిళ అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ (Banjarahills) ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్‌తో దురుసుగా ప్రవర్తించి, లైఫ్‌జాకెట్ చించివేసి, చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కొని పగులగొట్టింది.
View this post on Instagram
దాడికి పాల్పడినది సినీనటి సౌమ్యజాను అని గుర్తించి ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఇంటి వద్ద అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ సైతం అందుబాటులో లేవని, ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు సౌమ్యజాను(Sowmya Janu) ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అత్యవసర వైద్యసహాయం నిమిత్తం రాంగ్‌రూట్‌లో వెళ్లానని, పోలీసులు క్షమించాలని కోరారు. విధుల్లో ఉన్న పోలీసులు అసభ్యంగా దూషించడం వల్ల తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. అతడిపై దాడి చేయలేదని, పోలీసులు విచారణకు పిలవలేదన్నారు.