Hyderabad, July 4: అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) లీడ్‌ రోల్స్‌ లో (Lead Roles) నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' (Miss Shetty Mr Polishetty). యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పి.మహేష్‌ బాబు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. చెఫ్‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటిస్తుండగా, స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ నటిస్తున్నాడు. 'భాగమతి' తర్వాత యూవీ క్రియేషన్స్‌ లో అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)